Viral Video: సబ్బు పై కాలేయడంతో మూడో అంతస్థు మీదనుండి జారిపడ్డ మహిళ.. చివరకు..?

  • బెంగళూరు మహానగరంలోని కనకానగర్‌ లో ఘటన.
  • బట్టలు ఉఠేకుందుకు వెళ్లిన మహిళ.
  • సబ్బు జారడంతో ఘటన.
  • కోమాలోకి వెళ్లిన మహిళ.
Viral

Viral

Viral Video : ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదవ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం తరచుగా చూస్తూనే ఉన్నాము. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగళూరు నగరంలోని డీజే హల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకానగర్‌ లో ఓ మహిళ భవనంపై నుంచి పొరపాటున కింద పడిన సంఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడో అంతస్తు పై ఉన్న ఆ మహిళ బట్టలు ఉతుకేందుకు వెళ్లిన సమయంలో పొరపాటున సబ్బుపై కాలు వేయడంతో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వెళితే..

Bapatla: ఘోర విషాదం, రామాపురం బీచ్‌లో నలుగురు విద్యార్థులు గల్లంతు

బెంగళూరు మహానగరంలోని డీజేహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కనకానగర్‌ లో నివాసం ఉంటున్న ఓ మహిళ వారి ఇంటి పై బట్టలు ఉతికేందుకు వెళ్ళింది. అయితే ఆమె బట్టలు ఉతుకుతున్న సమయంలో పొరపాటున ఆ మహిళ ఓ సబ్బును కాలితో తొక్కింది. దాంతో ఆ మహిళ కాలుజారి బిల్డింగ్ పై నుంచి కింద పడబోయింది. అయితే అదే సమయంలో తన భర్త అక్కడే ఉండి పరిస్థితిని గమనించి వెంటనే కిందపడిపోతున్న తన భార్య చేతులను పట్టుకున్నాడు. ఆమె చేతులను పట్టుకొని పైకి లాగేందుకు ప్రయత్నం చేసినా.. పొరపాటున చేయి జారిపోవడంతో ఆ మహిళ ఒక్కసారిగా కింద పడిపోయింది. అయితే ఆ సమయంలో ఇరుగుపొరుగువారు తీసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Nara Lokesh: అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్

మూడో అంతస్తు నుండి బాధితురాలు కింద పడటంతో ఆవిడకి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన జరిగిన తర్వాత భర్తతోపాటు ఇరుగుపొరుగువారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆ మహిళ కోమాలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై డీజే హల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.