మాములుగా కేకు ధరలు అందులో వినియోగించే పదార్ధాలను బట్టి ఉంటుంది. ఎంత ఖరీదుపెట్టి కొనుగోలు చేసినా రెండు మూడు రోజులకు మించి ఉండదు. కానీ, ఆ కేకు 40 ఏళ్ల క్రితం నాటిది. పైగా రాజకుటుంబం పెళ్లి సమయంలో కట్ చేసిన కేకు కావడంతో వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయింది. 1981 జులై 29 వ తేదీన బ్రిటన్ యువరాజు చార్లెస్-డయానాలు పెళ్లిజరిగిన రోజు. ఆ రోజున ఈ కేకును కట్ చేసి అందరికి పంచారు. మొత్తం 23 కేకులు కట్ చేయగా అందులో ఒకటి వారిదగ్గర పనిచేస్తున్న యోయాస్మిత్ అనే మహిళకు ఇచ్చారు. ఆమె ఆ కేకును భద్రంగా దాచుకుంది. 2008లో ఆ కేకును ఓ కలెక్టర్‌కు అమ్మారు. కాగా, అలా అప్పుడు అమ్మిన ఆ కేకు ఇప్పుడు వేలానికి వచ్చింది. ఈ వేలంలో గ్యారీ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలకు ఈ కేకును కొనుగోలు చేశాడు.
Read: తాలిబన్లతో సంధికి ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు…
