ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 100కోట్ల మార్క్‌ను దాటింది. కరోనా తగ్గుముఖం పడుతున్నపటికి వ్యాక్సినేషన్ వేగం తగ్గడం లేదు. మనదేశంలో 18 ఏళ్లకు పైబడిన వాక్సిన్ అందిస్తున్నారు. అయితే, చిన్నారులకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందించలేదు. చిన్నారులకు అందించే వ్యాక్సిన్‌కు ఇటీవలే ఆమోదం లభించింది. 12 ఏళ్లకు పైబడిన చిన్నారులకు వ్యాక్సిన్ అందించబోతున్నారు.
Read: పెళ్లికి వథువు వెరైటీ కండీషన్స్… షాకైన బంధువులు…
అహ్మదాబాద్ కు చెందిన జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేసిన జైకోవ్ డీ వ్యాక్సిన్‌ను త్వరలోనే చిన్నారులకు అందించబోతున్నారు. డిఎన్ఏ ఆధారంగా తయారైన మూడు డోసుల వ్యాక్సిన్ ఇది. దీని ధరను రూ.398 గా నిర్ణయించారు. ఇది సూదితో పనిలేకుండా జెట్ అప్లికేటర్ ద్వారా వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్ చేస్తారు. కాగా, జైడస్ క్యాడిలాకు ఇప్పటికే కేంద్రం కోటి డోసులకు ఆర్డర్ ఇచ్చింది. 18 ఏళ్లు నిండిన వారికి అందించిన విధంగానే చిన్నారులకు కూడా కేంద్రం ఉచితంగానే వ్యాక్సిన్‌ను అందించబోతున్నది. ఇది మూడు డోసుల వ్యాక్సిన్. మొదటి డోసు తీసుకున్న 28 రోజులకు రెండో డోసు, 56 రోజుల తరువాత మూడో డోసు తీసుకోవాలి.