Site icon NTV Telugu

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా..? అదనపు వడ్డింపు షురూ..

ఆఫీసులో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. నచ్చిన ఫుడ్‌.. మెచ్చిన హోటల్‌లో ఆర్డర్‌ ఇస్తూ.. ఇష్టంగా లాగిస్తున్న భోజన ప్రియులకు అలెర్ట్‌.. ఎందుకంటే.. మీపైన అదనపు భారం పడుతోంది.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లపై జీఎస్టీ విధిస్తోంది ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి ఇది అమల్లోకి వచ్చింది.. దీంతో.. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు అయిన స్విగ్గీ, జోమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది..

Read Also: మాతా వైష్ణో‌దేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి

దీనిని, క్లౌడ్ కిచెన్‌లు, సెంట్రల్ కిచెన్‌లు అందించే సేవలు రెస్టారెంట్ సర్వీస్ కింద కవర్ చేస్తూ ఇవాళ్టి నుంచి ఐదు శాతం సేవల పన్ను చెల్లించాలని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి… జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా పాటించాల్సిందేనని.. జీఎస్టీ చెల్లించని రెస్టారెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది కేంద్రం.. కాగా, ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లపై ఇప్పటి వరకు రెస్టారెంట్లే స్వయంగా పన్ను వసూలు చేయడం.. అది ప్రభుత్వానికి చెల్లించడం చేసేవి.. కానీ, ఇప్పుడు వాటిని ట్యాక్స్‌మెన్‌కు చెల్లించే బాధ్యత.. డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లైన స్విగ్గీ, జోమాటోపై పడింది..

Exit mobile version