NTV Telugu Site icon

Zebra Crossing: నగర వీధిలో జీబ్రా హల్ చల్.. రోడ్డుపై ఏం చేసిందంటే..

Zebra Crossing

Zebra Crossing

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఓ జీబ్రా హల్ చల్ చేసింది. జంతుప్రదర్శనశాల నుండి గురువారం తప్పించుకున్న జీబ్రా మూడు గంటలపాటు సియోల్‌లోని పలు వీధుల్లో తిరుగుతూ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. సియోల్ చిల్డ్రన్స్ గ్రాండ్ పార్క్‌లోని జూ నుండి సెరో అనే జీబ్రా తప్పించుకుంది. రోడ్డుపై పరిగెడుతూ హల్ చల్ చేసింది. రోడ్లపై కార్లను దాటుకుంటూ, వీధిలో తిరుగింది. జీబ్రాను పట్టుకునేందకు అధికారులు తీశ్రంగా శ్రమించారు. అతి కష్టం మీద జీబ్రాకు మత్తు ఇచ్చి జూకి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments