రేపటి నుంచి 36 గంటల పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు నిరసనగా ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు వ్యతిరేకంగా రేపు, ఎల్లుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేపట్టబోతున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ బూతుల వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గస్థాయిలో రెండు రోజులపాటు నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిపారు. బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో జనాగ్రహ దీక్షలు చేయబోతున్నట్టు సజ్జల పేర్కొన్నారు.
Read: కరోనా ఎఫెక్ట్: రష్యాలో ఉద్యోగులందరికీ వారం రోజులు సెలవులు…