NTV Telugu Site icon

జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థుల జాబితా రెడీ..! వీరికే ఛాన్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు నోటిషికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎంపీపీ ఎన్నిక 24వ తేదీన జరగనుండగా.. జడ్పీ చైర్మన్‌, వైస్ చైర్మన్ల ఎన్నికలు 25వ తేదీన జరగనున్నాయి.. అయితే, పరిషత్‌ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ… క్లీన్‌స్వీప్‌ చేసింది.. అన్ని జడ్పీ చైర్మన్‌ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.. ఇదే ఊపులో జడ్పీ ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది.. వైసీపీ దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసింది.. వారినే బరిలోకి దింపి.. జెడ్పీ ఛైర్మన్లుగా గెలిపించుకోనుంది.. ఇక, ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. వైసీపీ ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి.

  1. శ్రీకాకుళం – పిరియా విజయ
  2. విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు
  3. విశాఖపట్నం – శివరత్నం
  4. తూర్పు గోదావరి – విప్పర్తి వేణుగోపాల్‌
  5. పశ్చిమగోదావరి – కవురు శ్రీనివాస్‌
  6. కృష్ణా జిల్లా – ఉప్పాళ్ల హారిక
  7. గుంటూరు – క్రిస్టినా
  8. ప్రకాశం జిల్లా – బూచేపల్లి వెంకాయమ్మ
  9. నెల్లూరు – ఆనం అరుణమ్మ
  10. కడప – ఆకేపాటి అమర్నాథరెడ్డి
  11. కర్నూలు – రామ సుబ్బారెడ్డి (తాత్కాలికం)
  12. చిత్తూరులో – వి. శ్రీనివాసులు
  13. అనంతపురం- గిరిజని ఖరారు చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌..