NTV Telugu Site icon

ఏపీలో వైసీపీ గ్రాండ్ విక్ట‌రీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిష‌త్ ఎన్నిక‌ల‌కు సంబందించిన పూర్తి ఫ‌లితాలు వ‌చ్చాయి.  ఈ ఫ‌లితాలు అధికార వైసీపీకి అనుకూలంగా ఉండ‌టం విశేషం.  ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ స్థానాల్లో వైసీపీ దూసుకుపోయింది.  భారీ విజ‌యాలు న‌మోదు చేసుకున్న‌ది.  రాష్ట్ర‌వ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా అధికార వైసీపీ 5998 చోట్ల విజ‌యం సాధించింది.  తెలుగుదేశం పార్టీ 826 చోట్ల‌, జ‌నసేన 177 చోట్ల‌, బీజేపీ 28, సీపీఎం15, సీపీఐ 8, ఇత‌రులు 157 స్థానాల్లో విజ‌యం సాధించారు.  ఇండిపెండెంట్లు ఎక్కువ స్థానాలు గెలుచుకోవ‌డం విశేషం.  ఇక ఇదిలా ఉంటే 512 జ‌డ్పీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే, 502 చోట్ల అధికార వైసీపీ విజ‌యం సాధించింది.  టీడీపీ 6, జ‌న‌సేన 2 సీపీఎం 1, ఇండిపెండెంట్లు 1 జ‌డ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాలే విజ‌యానికి తార్కాణం ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.  

Read: అమెరికాను వ‌ణికిస్తున్న క‌రోనా… ప్ర‌తిరోజూ 2 వేల‌కు పైగా మ‌ర‌ణాలు…