వైఎస్ షర్మిల రెండోరోజు పాదయాత్ర ముగిసింది. అక్టోబర్ 20 వతేదీ నుంచి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. శంషాబాద్ మండలంలోని క్యాచారం వరకు ఈ యాత్ర సాగింది. ఈరోజు షర్మిల పాదయాత్ర 12 కిలోమీటర్లమేర సాగింది. ఈరోజు క్యాచారంలోనే షర్మిల బసచేయనున్నారు. మొయినాబాద్ మండలం నక్కలపల్లి నుంచి క్యాచారం వరకు సాగిన పాదయాత్రకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా, ఇప్పటి వరకు మొత్తం 24 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. చేవెళ్ల నుంచి మొదలుపెట్టిన ఈ యాత్రను రాష్ట్రంలోని 4000 కిలోమీటర్ల మేర కొనసాగనున్నది.
Read: సమంత కేసులో ముగిసిన వాదనలు… తీర్పు…