స‌మంత కేసులో ముగిసిన వాద‌న‌లు… తీర్పు…

కూక‌ట్ ప‌ల్లి కోర్టులో స‌మంత మూడు యూట్యూబ్ ఛాన‌ల్స్‌పై ప‌రువున‌ష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే.  ఈ కేసుపై ఈరోజు విచార‌ణ చేప‌ట్టారు.  స‌మంత ఇంకా విడాకులు తీసుకోలేద‌ని, ఆ లోగానే ఆమెపై దుష్ప్ర‌చారం చేస్తూ ప‌రువుకు భంగం క‌లింగేలా ప్ర‌వ‌ర్తించారని, స‌మంత‌ను వ్య‌క్తిగతంగా టార్గెట్ చేసుకొని వార్త‌లు రాశార‌ని, ఆమెకు అక్ర‌మ సంబంధాలు అంట‌గ‌ట్టార‌ని సమంత త‌ర‌పు న్యాయ‌వాది కోర్టులో వాదించారు.  వాద‌న‌లు విన్న కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  త‌ప్పు  జ‌రిగింద‌ని భావిస్తే ప‌రువున‌ష్టం దాఖ‌లు చేసే బ‌దులు వారినుండి క్ష‌మాప‌ణ‌లు కోర‌వ‌చ్చుక‌దా అని ప్ర‌శ్నించింది కోర్టు.  సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ప‌బ్లిక్ డొమైన్ లో వారే పెడుతున్నార‌ని, ప‌రువుకు భంగం క‌లిగింది అని వారే అంటున్నార‌ని కోర్టు పేర్కొన్న‌ది.  కాగా, ఈకేసులో వాద‌న‌లు ముగియ‌డంతో తీర్పును రేప‌టికి వాయిదా వేసింది కూక‌ట్‌ప‌ల్లి కోర్టు. 

Read: ఎంజీ అస్ట‌ర్ రికార్డ్‌: 20 నిమిషాల్లో 5 వేల కార్లు బుకింగ్‌…

Related Articles

Latest Articles