ప్రపంచంలో మనకు తెలియని వింతైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అసలు అలాంటివి కూడా ఉంటాయా అనే విధంగా ఉంటాయి ఆ ప్రదేశాలు. వాటిని ఒక్కసారైనా చూసి తీరాలి అనిపించే విధంగా ఉంటాయి. ఆ ప్రదేశాలు ఏంటో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
1. చైనాలోని హువాన్ ప్రావిన్స్‌లోని తియాంజీ పర్వతాలు భూలోక స్వర్గాన్ని తలపిస్తుంటాయి. సున్నపురాయితో పచ్చని చెట్లతో భూమి నుంచి ఎత్తుగా పైకి ఉండే ఈ పర్వతాలను చూసేందుకు నిత్యం అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
2. సొకోత్రా ఐలాండ్… ఇక్కడ కనిపించే వృక్షాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఆఫ్రికా దేశం నుంచి సుమారు 60 లక్షల సంవత్సరాల క్రితం విడిపోయా ప్రత్యేకంగా ఏర్పడింది. ఈ దీవి ప్రస్తుతం యెమన్‌లో ఉన్నది. ఈ వృక్షాలతో నిండిన సొకోత్రా ఐలాండ్ ను చూసేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు.
Read: ‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీ రివీల్ చేసేసిన నాని
3. చాక్‌లేట్ హిల్స్: ఈ కొండలు చూడటానికి అచ్చంగా చాక్‌లేట్ మాదిరిగా ఉంటాయి. సుమారు 1700 కొండలు ఒకే ఆకృతి, సైజులో ఉంటాయి. ఇవి ఫిలిప్పిన్స్‌లోని బోహోల్ ఐలాండ్‌లో ఉన్నాయి.
4. హ్యాండ్ ఇన్ డిజర్ట్: సాహసయాత్రలు చేసేవారిని చిలి ఆకర్షిస్తుంటుంది. చిలీ దేశంలోని అటకామా ఎడారిలో 36 అడుగుల ఎత్తైన చేయి విగ్రహం ఒకటి ఉన్నది. ఆ విగ్రహాన్ని 1992లో మోరియో ఇర్రాజబుల్ అనే శల్పి చెక్కాడు. అన్యాయం, బాధ, హింస, ఒంటరితనానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని చెక్కారు.