Site icon NTV Telugu

హైదరాబాద్‌లో ‘ఎల్లో’ అలర్ట్‌..

తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. తెలంగాణలోని పలు జిల్లా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత పది సంవత్సారాలలో చూడనటువంటి ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే తాజా శనివారం రోజున తెలంగాణలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ నమోదు కావడం గమనార్హం. ఈ రోజు హైదరాబాద్‌లోని కూడా చలి తీవ్రత పెరిగిందని అధికారులు వెల్లడించారు.

తాజా నివేదిక ప్రకారం సంగారెడ్డిలో నేడు 6.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్‌ 21వరకు హైదరాబాద్‌ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఏజేన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాలకు సైతం కొని రోజుల పాటు ఆరెంజ్‌ అలర్ట్‌ అమలులో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version