ప్రపంచ పులుల దినోత్సవ వేడుకలను ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం తీసుకున్న చర్యల గురించి అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో పులుల సంఖ్య పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 47 నుంచి 63 కి ఈ సంఖ్య పెరిగింది. ఇక కడప, చిత్తూరు జిల్లాల్లోని అడవుల్లో పులుల ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. పులుల సంరక్షణకు చర్యలు పటిష్టంగా ఉండాలని, పులుల సంఖ్య పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Read: భీమ్లా నాయక్ కు భలే కలిసొచ్చింది!