NTV Telugu Site icon

ప్ర‌పంచంలోనే అత్యంత ఇరుకైన వీధి ఇదే…

ఇంటికి ఇంటికి మ‌ధ్య గ్యాప్‌లు ఉండటం స‌హ‌జమే.  అయితే, ఒక వీధి రోడ్డు నుంచి మ‌రో వీధి రోడ్డులోకి వెళ్ల‌డానికి రోడ్డు క్రాస్ చేసి వెళ్లాలి లేదా వీధి గుండా వెళ్లాలి.   రెండు ఇళ్ల మ‌ధ్య‌గుండా ఖాళీ స్థ‌లం ఉండి, ఆ ఖాళీ స్థలం గుండా ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు వెళ్లే అవ‌కాశం ఉంటే దానిని వీధి అని పిలుస్తారు.  వీధి అంటే విశాలంగా ఉంటాయి.  క‌నీసం ఓ చిన్న కారు, మ‌నుషులు న‌డిచేందుకు వీలుగా ఉంటాయి.  కానీ, ఆ వీధి అలా కాదు.  కొద్దిమాటి లావుగా ఉన్న వ్య‌క్లి లోప‌లికి వెళ్తే మ‌ధ్య‌లోనే ఇరుక్కుపోతాడు.  1.1 అడుగులున్న ఆ వీధిని గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌లోకి ఎక్కించారు.  

Read: మ‌రో సంచ‌ల‌న ప్ర‌యోగానికి సిద్ద‌మ‌వుతున్న ఎల‌న్ మ‌స్క్‌… కార్బ‌న్‌డైఆక్సైడ్‌తో..

జర్మనీ భూభాగ లెక్కల ప్రకారం ఈ వీథికి రెండు వైపులా ఉన్న భవనాలు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. 1820లో ఈ వీధిని అధికారికంగా పబ్లిక్‌ స్ట్రీట్‌ 77గా ప్రభుత్వం ప్రకటించింది. అప్ప‌టి నుంచి ఈ ఇరుకైన వీధి ప‌ర్యాట‌క‌ప్రాంతంగా మారిపోయింది.  ఈ స్ట్రీట్ జ‌ర్మ‌నీలోని రియూల్టిన్‌జెన్‌ పట్టణంలో ఉంది.  ఈ ఇరుకైన వీధికి స్ప్రోయూర్‌హోఫ్‌ స్ట్రాసే అనే పేరు ఉంది.  జ‌ర్మ‌నీ వెళ్లిన ప‌ర్యాట‌కులు త‌ప్ప‌నిస‌రిగా ఈ వీధిని సంద‌ర్శిస్తుంటారు.