NTV Telugu Site icon

ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన చేప ఇదే…

చేప‌ల ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది.  అనేక రోగాల నుంచి చేప‌లు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి.  కొన్ని చేప‌లు రుచితో పాటుగా ఖ‌రీదు కూడా అధికంగా ఉంటుంది.  సాధార‌ణంగా టూనా చేప‌ల ఖ‌రీదు చాలా ఎక్కువ‌గా ఉంటుంది.  అయితే, ఈ టూనా చేప‌ల్లో కూడా బ్లూఫిన్ టూనా ఖ‌రీదు మ‌రింత అధికం అంటున్నారు. ఈ రకం చేప‌ల‌ను అంత‌రించిపోయే జాతి చేప‌లుగా గుర్తించ‌డంతో ధ‌ర‌లు అధికంగా ఉంటాయి.  చాలా అదురుగా మాత్ర‌మే ఇవి క‌నిపిస్తుంటాయి.  కొన్ని దేశాల్లో ఈ చేప‌ల వేటకు అనుమ‌తి ఉండ‌గా, కొన్ని దేశాల్లో మాత్రం నిషేదం ఉన్న‌ది.  ఇటీవ‌ల జ‌పాన్‌లో 278 కిలోల బ‌రువైన బ్లూఫిన్ టూనా చేప దొరికింది.  ఈ అరుదైన చేప‌ను 2.5 మిలియ‌న్ పౌండ్ల‌కు వేలంలో అమ్మేశారు.  అంటే మన క‌రెన్సీలో దాదాపు రూ.25 కోట్ల రూపాయ‌ల పైమాటే.  వామ్మో ఇంత ఖ‌రీదా అని నోరెళ్ల‌బెట్ట‌కండి.  అరుదైన చేప కాబ‌ట్టే ఇంత ధ‌ర ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.  బ్రిట‌న్ వంటి దేశాల్లో ఈ చేప‌ల వేట నిషేదం కావ‌డంతో ఒక‌వేళ ఎవ‌ర‌కైనా ఈ చేప చిక్కినా దానిని స‌ముద్రంలో వ‌దిలేస్తుంటారు.  

Read: కొత్త నిబంధ‌న‌లు: రెండు డోసులు తీసుకున్నా ఆ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి…