Site icon NTV Telugu

ప్ర‌పంచ‌దిశ‌ను మార్చేస్తున్న రోబోలు…

టెక్నాల‌జీ అభివృద్ది చెందిన త‌రువాత మ‌నిషి త‌న అవ‌స‌రాల కోసం, ప్ర‌పంచం మ‌నుగ‌డ కోసం రోబోల‌ను త‌యారు చేశాడు.  ఈ రోబోలు మ‌నిషికి అన్ని రంగాల్లోనూ స‌హ‌క‌రిస్తున్నాయి.  కృత్రిమ మేధ‌తో త‌యారైన రోబోల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటున్నారు.  ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌తో సొంతంగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకునే సామ‌ర్థ్యం కూడా రోబోల‌కు ఉంటుందన‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.  మ‌నుషులు ఆలోచించిన విధంగానే రోబోలు కూడా ఆలోచించ‌గ‌లిగితే మ‌నిషి మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం కావొచ్చు.  ఇక ఇదిలా ఉంటే 2021లో చాలా ర‌కాల రోబోలు ప్ర‌పంచం గ‌తిని మార్చేశాయి.  

Read: ఎల‌న్ మ‌స్క్ కు ఆ భ‌యం ఎక్కువ…అందుకే గొప్ప‌వాడ‌య్యాడ‌ట‌…

మార్స్ గ్ర‌హంపై ప‌రిశోధ‌న కోసం నాసా పంపిన రోబో హెలికాఫ్ట‌ర్ ఇన్‌జెన్యునిటీ ఈ ఏటి మేటి రోబోగా చెప్పుకోవాలి.  భూగ్రహాన్ని దాటి వేరే గ్ర‌హంపై ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌తో సొంతంగా ఎర‌గగ‌లిగింది.  1.8 కిలోల బ‌రువున్న ఆ రోబో హెలికాఫ్ట‌ర్ ఏక‌ధాటిగా కిలోమీట‌ర్ వ‌ర‌కు ప్ర‌యాణం చేయ‌గ‌ల‌దు.  మార్స్‌లోని వాతావ‌ర‌ణాన్ని అంచ‌నా వేసేందుకు ఈ రోబో ఉప‌యోగ‌ప‌డుతుంది.  మోలీ రోబోటిక్స్ అనే సంస్థ మోలీ అనే వంట‌ల‌ను సిద్ధం చేసే రోబోను ఆవిష్క‌రించింది.  ఎలాంటి వంట కావాలో చెప్తే చాలు క్ష‌ణాల్లోనే త‌యారు చేసేస్తుంద‌ట‌.  మ‌నిషికి అన్నిరకాల ప‌నుల్లో స‌హాయం చేసేందుకు చైనాకు చెందిన ఉబ‌ర్ టెక్ అసే సంస్థ వాక‌ర్స్ రోబోను త‌యారు చేసింది.  ఇది మ‌నిషిలాగే ఉంటుంది.  ఈ రోబో మ‌నిషికి అన్ని ర‌కాల‌గా స‌హాయం చేస్తుంది.  చ‌ద‌రంగంతో పాటు అవ‌స‌ర‌మైతే మ‌నిషికి మ‌సాజ్ కూడా చేస్తుంది.  యూకేకు చెందిన ఇంజ‌నీర్డ్ ఆర్ట్స్ అనే సంస్థ అమికా పేరుతో ఓ రోబోను త‌యారు చేసింది.  ఈ రోబో మ‌నిషిలాగే హావ‌భావాలు ప‌లికించ‌గ‌ల‌దు.  ఒకే స‌మ‌యంలో నాలుగైదు ర‌కాల హావ‌భావాలు ప‌లికిస్తూ ఔరా అనిపిస్తోంది అమికా.  

Exit mobile version