NTV Telugu Site icon

విశాఖ ఉక్కు: 250 మందితో 25 గంట‌లు దీక్ష‌…

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఎప్పుడైతే కేంద్రం ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌రించేందుకు ప్ర‌తిపాద‌న‌లు తీసుకొచ్చిందో అప్ప‌టి నుంచే కార్మికులు, ఉద్యోగులు నిర‌స‌న‌బాట ప‌ట్టారు.  వివిధ పార్టీలు మ‌ద్ద‌తు ఇస్తున్నాయి.  ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు  కార్మికుల నిర‌స‌న‌ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నాయి.  విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా చేస్తున్న పోరాటం నేటికి 250 రోజులు పూర్త‌యింది.  దీంతో ఈరోజు 250 మందితో25 గంట‌ల‌పాటు నిరాహార దీక్ష చేసేందుకు కార్మికులు సిద్ధం అవుతున్నారు.  కేంద్రం త‌మ ప్ర‌తిపాద‌న‌ను వెనక్కి తీసుకునే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.  

Read: క‌రోనాపై జ‌పాన్ ఘ‌న విజ‌యం…