ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఫుడ్ ఐటెమ్స్‌లో పిజ్జా కూడా ఒకటి. ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో పిజ్జాలు అమ్ముడవుతుంటాయి. పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న పట్టణాల వరకూ పిజ్జాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఆర్డర్ చేసిన పిజ్జాను స్లైసెస్ లాగా కట్ చేసి కస్టమర్లకు అందిస్తుంటారు. అయితే, ఇప్పుడు పిజ్జాతో పాటుగా ఓ చిన్న టేబుల్ టూల్‌ను ఫ్రీగా అందిస్తున్నారట.
Read: ఎలన్ మస్క్ సూటి ప్రశ్న: 6 బిలియన్ డాలర్లతో ఆకలి తీరిపోతుందా?
పిజ్జా మధ్యభాగంలో ఈ చిన్న ప్లాస్టిక్ టేబుల్ టూల్ ఉంటుంది. టేబుల్ టూల్‌ను ఎందుకు వినియోగిస్తారు అన్నది చాలా మందికి తెలియక పడేస్తుంటారు. ఈ టేబుల్ టూల్‌ను పిజ్జాను కట్ చేసుకోవడం కోసం అందిస్తున్నారట. రెండు చేతులతో పిజ్జాను డైరెక్ట్‌గా తాకకుండా ఉండేందుకు ఈ టేబుల్ టూల్ ఉపయోగపడుతుందని నెజిజన్లు చెబుతున్నారు. ఈ పిజ్జా టేబుల్ ఉపయోగం గురించి ఫరూఖీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిన్న వీడియోను 20 మిలియన్ల మంది వీక్షించారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో ట్రెంట్ అవుతున్నది.