దేశంలో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ వంటి వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్ కావడంతో 28 నుంచి 48 రోజుల వ్యవధిలో రెండు డోసులు వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన లేకపోవడంతో టీకాలు తీసుకోవడాని ప్రజలు ముందుకు రావడంలేదు. వ్యాక్సిన్ వేసేందుకు ఇంటికి వచ్చిన వారిపై కొంతమంది తిరగబడుతున్నారు. వ్యాక్సిన్‌పై రకరకాల అపోహలు ఉండటమే ఇందుకు కారణం. ఇక, రాజస్థాన్ రాష్ట్రంలో సర్కార్ డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా పుష్కర్ సమీపంలోని నాగెలావ్ అనే గ్రామానికి వైద్యసిబ్బంది వెళ్లారు. అక్కడ వ్యాక్సిన్ వేయించేందుకు ఓ ఇంటికి వెళ్లిన వైద్యసిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. తనకు వ్యాక్సిన్ అవసరంలేదని, దగ్గరికి వస్తే పాముతో కాటు వేయిస్తానని చెప్పి బుట్టలోనుంచి పామును తీసింది మహిళ. దీంతో ఆరోగ్యకార్యకర్తలు షాక్ అయ్యారు. విషయాన్నిఊర్లోని పెద్దలకు చెప్పడంతో గ్రామస్తులు వ్యాక్సిన్‌పై మహిళకు అవగాహన కల్పించడంతో ఎట్టకేలకు ఒప్పుకొని వ్యాక్సిన్ తీసుకున్నది ఆ మహిళ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read: అతనో రియల్ మోగ్లీ… ఏళ్ల తరబడి అడివిలో గడిపి… ఇప్పుడు…
