Site icon NTV Telugu

అంబ‌ర్ పేట‌లో దారుణం: భ‌ర్త కుట్టిన బ్లౌజ్ న‌చ్చ‌లేద‌ని భార్య ఆత్మ‌హ‌త్య‌…

చిన్న చిన్నవిష‌యాల‌కు మ‌స‌స్తాపం చెంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు.  కూర న‌చ్చ‌లేద‌ని, న‌చ్చిన వ‌స్తువు కొనివ్వ‌లేద‌ని ఇలా చిన్న చిన్న విష‌యాల‌కే ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు.  ఇలానే భ‌ర్త కుట్టిన బ్లౌజ్ న‌చ్చ‌లేద‌ని ఓ భార్య ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.  ఈ సంఘ‌ట‌న అంబ‌ర్‌పేట్‌లో జ‌రిగింది.  అంబ‌ర్‌పేట‌లో శ్రీనివాసులు, టి విజ‌య‌లక్ష్మీలు గోల్నాక తిరుమ‌ల‌న‌గ‌ర్‌లో నివ‌శిస్తున్నారు.  వీరికి ఇద్ద‌రు పిల్ల‌లున్నారు.  భ‌ర్త శ్రీనివాస్ ద్విచ‌క్ర‌వాహ‌నంపై తిరుగుతూ చీర‌లు విక్ర‌యిస్తుంటాడు.  ఇంట్లో టైల‌రింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

Read: వైర‌ల్‌: ర‌న్‌వేపై విమానం పంక్చ‌ర్‌… ప్ర‌యాణికులంతా దిగి…

అయితే, శ‌నివారం రోజున భ‌ర్త శ్రీనివాసులు భార్య‌కోసం ఓ బ్లౌజ్ కుట్టాడు.   ఆ బ్లౌజ్ భార్య‌కు న‌చ్చ‌లేదు.  త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్ప‌డంతో కుట్టిన జాకెట్ కుట్లు విప్పేసి న‌చ్చిన‌ట్టు కుట్టుకోమ‌ని భార్య‌కు ఇచ్చి, టైల‌రింగ్ చేసుకుంటూ కూర్చున్నారు.  దీంతో భార్య త‌న గ‌దిలోకి వెళ్లి త‌లుపు వేసుకుంది.  మ‌ధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వ‌చ్చిన పిల్ల‌లు బెడ్‌రూమ్ త‌లుపులు త‌ట్ట‌గా తీయ‌లేదు.  ఎంత‌సేపు పిలిచినా ప‌ల‌క్క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన భ‌ర్త త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి చూడ‌గా భార్య విజ‌య‌ల‌క్ష్మీ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

Exit mobile version