మూడు వేల రూపాయలు పెడితే ఎలాంటి భోజనం చేయవచ్చో అందరికీ తెలుసు. మంచి రుచికరమైన భోజనం చేయవచ్చు. రకరకాల వంటలతో కూడిన పసైందైన భోజనం మనకు దొరుకుతుంది. ఇలా అనుకొని ఓ మహిళ రెస్టారెంట్‌కు వెళ్లి మెనూలో చూసి ఫుడ్ ను ఆర్డర్ చేసింది. ఎంత మంచి భోజనం వస్తుందో అని ఆతృతగా ఎదురు చూసిన ఆ మహిళకు రెస్టారెంట్ షాకిచ్చింది. ఓ చిన్న రోట్టే, చిన్న స్వీట్ ముక్క, మరొక చిన్న పదార్ధం తీసుకొచ్చి ముందు పెట్టారు. దానిని చూసి ఆమె షాక్ అయింది. ఏం చేయాలో తెలియక బిక్కముఖం పెట్టింది. ఫుడ్ ఆర్డర్‌ను ఫొటోగా తీసి ట్విట్టర్‌లో షేర్ చేసింది. 30 పౌండ్లు పెట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తే కనీసం చిన్న పిల్లల బ్రేక్ ఫాస్ట్ అంతకూడా లేని రొట్టె ముక్కను ముఖాన పడేశారని వాపోయింది. అందుకే మెనూలో ఉన్న ఖరీదైన ఫుడ్‌ను కాకుండా సింపుల్‌గా తక్కువగా ఉండే ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవాలని నెటిజన్లు హితబోధ చేశారు. ఈ సంఘటన లండన్‌లోని షార్డ్ బిల్డింగ్‌లో ఉన్న హోటల్‌లో జరిగింది.
రూ. 3వేలు పెట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తే… ఏం తెచ్చారో తెలుసా…!!
Show comments