పుట్టినప్పటి నుంచే ఆ యువతి స్పైనల్ కార్డ్ సమస్యలతో బాధపడుతున్నది. తన తల్లి గర్భం దాల్చినపుడు ఆమె వైద్యుడు సరైన ట్రీట్‌మెంట్ చేయకపోవడం, సరైన ప్రిస్క్రిప్షను సూచించకపోవడం చేత పుట్టిన ఈవీ తూంబేస్ వెన్నుముక సమస్యలతో జన్మించింది. అప్పటి నుంచి ప్రతీ క్షణం ఆమె ఆనారోగ్యంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నది.
Read: 29 దేశాల్లో ఒమిక్రాన్… ఇప్పటి వరకు ఎన్ని కేసులంటే…
తాను అనుభవిస్తున్న ఈ బాధలకు కారణం తన తల్లికి వైద్యం అందించిన డాక్టర్ ఫిలిప్ మిఛెల్ పై కోర్టులో కేసులు ఫైల్ చేసింది ఆ యువతి. ఫోలిక్ యాసిడ్, సరైన మందులు సూచించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని యువతి కోర్టుకు తెలియజేంది. యువతి బాధకు కారణమైన వైద్యునిపై కేసును గెలిచి భారీ మొత్తాన్ని పరిహరంగా గెలుచుకుంది ఈవీ.
