NTV Telugu Site icon

క‌రోనా ప్రభావం: మ‌హిళ‌ల‌కు పెరుగుతున్న అవ‌కాశాలు…

క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.  క‌రోనా త‌రువాత నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది.  ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి.  అయితే, ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉద్యోగాల్లో మ‌హిళ‌ల ప్రాధాన్యం పెరిగింద‌ని నెట్‌వ‌ర్కింగ్ ప్లాట్‌ఫామ్ అప్నాడాట్‌కో తెలియ‌జేసింది.  ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ మ‌హిళ‌లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసి రాణిస్తున్నార‌ని, ప‌రిస్థితుల‌కు త‌గిన విధంగా అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నార‌ని నెట్‌వ‌ర్కింగ్ ప్లాట్‌ఫామ్ తెలియ‌జేసింది.  

Read: ప్ర‌ధాని మోడీకి పుతిన్ ఫోన్‌… దీనిపైనే చ‌ర్చ‌…

అప్నాడాట్ కో యూజ‌ర్ల సంఖ్య 2021లో 430శాతం మేర పెరిగింద‌ని పేర్కొన్నది.  బీపీవో, బ్యాంక్ ఆఫీస్‌, ఫ్రంట్ ఆఫీస్‌, అకౌంట్‌, టీచింగ్‌, అడ్మిన్‌, డేటా ఇలా అనేక రంగాల్లో మ‌హిళ‌లు రాణిస్తున్నార‌ని, అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నార‌ని నెట్‌వ‌ర్కింగ్ ప్లాట్‌ఫామ్ తెలియ‌జేసింది.  వీటితో పాటుగా పురుషులు రాణిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్‌, డ్రైవింగ్‌, డెలివ‌రి పార్ట‌నర్స్ వంటి రంగాలకు కూడా మ‌హిళ‌లు ధ‌ర‌ఖాస్తు చేస్తున్నార‌ని నెట్‌వ‌ర్కింగ్ ప్లాట్‌ఫామ్ తెలియ‌జేసింది.