Site icon NTV Telugu

భ‌ర్త‌పై ప్రేమ‌తో ఆ భార్య ఏం చేసిందో తెలుసా..

క‌ట్టుకున్న భ‌ర్త‌పై భార్య‌కు ప్రేమ ఉండ‌టం స‌హ‌జ‌మే.  భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమానురాగాలు ఉన్న‌ప్పుడే ఆ దాంప‌త్యం స‌జావుగా సాగుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య అలాంటి ప్రేమ ఉన్న‌ప్పుడు అనుకోని విధంగా ఇద్ద‌రిలో ఒక‌రు మ‌ర‌ణిస్తే ఆ విషాదం జీవితాంతం వెంటాడుతుంది అన‌డంలో సందేహం లేదు.  బ్రిట‌న్‌కు చెందిన కాసీ అను మ‌హిళ‌కు 2009లో సీన్ అనే వ్య‌క్తితో వివాహం జ‌రిగింది.  ఆ అన్యోన్యంగా సాగుతున్న దాప‌త్యంలో విషాదం నిండింది.  భ‌ర్త సీన్ అస్త‌మాతో మృతి చెందాడు. భ‌ర్త మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేని కాసీ, ఆ భ‌ర్త చితా భ‌స్మాన్ని ద‌గ్గ‌ర పెట్టుకుంది.  అంతేకాదు, ఆ చితాభ‌స్మాన్ని కొద్దికొద్దిగా తిన‌డం ప్రారంభించింది.  అలా చేసిన‌ప్పుడ‌ల్లా త‌న భ‌ర్త త‌న‌తోనే ఉన్నాడ‌నే ఫీలింగ్ క‌లిగేద‌ట‌.  అప్ప‌టి నుంచి చితాభ‌స్మానికి అడిక్ట్ అయ్యాన‌ని, చితాభ‌స్మం కుళ్లిన వాస‌న వ‌స్తున్న‌ప్ప‌టికీ భ‌ర్త‌పై ఉన్న ప్రేమ‌తో దానిని తింటున్నాన‌ని పేర్కొన్న‌ది కాసీ.  దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  

Read: పంజాబ్‌లో అమ‌రీంద‌ర్ పొత్తు… బీజేపీకి లాభిస్తుందా?

Exit mobile version