భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వయసు వచ్చిన తర్వాత తమ పిల్లలకు వివాహాలు చేయాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది యువతులు ఈ వివాహ ఆచారం పట్ల ఆఇష్టంగా వ్యవహరిస్తున్నారు. సమాజంలోని యువతి యువకులలో పెళ్లి అంటే అ ఇష్టంగా మారిపోయింది. ప్రస్తుత ప్రపంచంలో వివాహితులకు సరైన రక్షణ లేకుండా పోయింది.అంతేకాకుండా సమాజంలో పెళ్లి కానీ యువతి అంటే చిన్న చూపుగా మారిపోయింది. వివాహం చేసుకొని ఒకరి దగ్గరగా బానిసగా బ్రతక కూడదు అన్న ఉద్దేశంతో కొంతమంది యువతులు వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తాజా ఓ యువతి దేవుడిని పెళ్లి చేసుకుంది. ఈ వింత ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. 30 ఏళ్ల మహిళ ఆదివారం ఔరయ్యాలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెళ్లి చేసుకుంది. శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోవాలనే కోరికను ఆమె తండ్రి పెళ్లి వేడుకను ఏర్పాటు చేయడం ద్వారా నెరవేర్చాడు.
Also Read:NTR: రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు.. తారక్ కళ్ళల్లో నీళ్లు
చిన్నప్పటి నుంచి ఆరాధించిన దైవాన్నే పెళ్లిచేసుకుంది రక్షా అనే యువతి. బాల్యం నుంచి కృష్ణుడిపై ప్రేమను పెంచుకున్న రక్షా…బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. రక్షా సోలంకి ఔరేయా జిల్లాలోని బిధునా పట్టణంలో నివసిస్తోంది. ఈమెకు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి, ప్రేమ. పెరుగుతున్నకొద్దీ ఆయననే ఆరాధిస్తూ ప్రేమను పెంచుకుంది. చివరకు కృష్ణుణ్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లి చేసుకుంది. వీరి వివాహం తర్వాత బంధువులంతా ఆచార వ్యవహారాల ప్రకారం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా జరిపారు. కృష్ణుడి విగ్రహంతోనే వధువు ఇంటి నుంచి బయటకొచ్చింది. తాను ఒకప్పుడు శ్రీ కృష్ణుడిని కలలో పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత తాను శ్రీకృష్ణుడికి పూర్తిగా అంకితమైపోయానని రక్షా చెప్పింది.కృష్ణుడి విగ్రహంతో కలిసి కారులో వెళ్తూ, ఆ అమ్మాయి బంధువుల ఇంటికి చేరుకుంది. దేవుడి భక్తిలో మునిగిపోయిన రక్షాని చూసేందుకు అక్కడ కూడా జనం గుమిగూడారు.