Site icon NTV Telugu

ఇదేం ఫ్యాష‌న్‌రా బాబు… ఆమెను చూసి ప‌రుగులు తీస్తున్నారు…

ఫ్యాష‌న్‌గా ఉండాల‌ని అంద‌రికీ ఉంటుంది.  రంగురంగుల దుస్తులు, వివిధ రకాల హెయిర్ స్టైయిల్‌తో మ‌హిళ‌లు బ‌య‌ట‌కు వ‌స్తుంటారు.  అంద‌రిలా కాకుండా కొత్త‌గా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అవుతుంటారు. న‌లుగురు న‌డిచిన బాట‌లో న‌డిస్తే ప్ర‌త్యేక‌త ఏముంటుంది.  అందుకే ఈ మ‌హిళ కొత్త‌గా ఆలోచించింది.  క్ష‌ణాల్లో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.  సాధార‌ణంగా హెయిర్‌కి హెయిర్ పిన్ లేదంటే ర‌బ్బర్ బ్యాండ్ వంటివి పెట్టుకుంటుంటారు.  అయితే, ఈ మ‌హిళ కాస్త భిన్నంగా ఆలోచించి త‌ల కొప్పుకు పామును చుట్టుకొని మాల్‌కి వ‌చ్చింది.  దూరం నుంచి చూసి భ‌లే బాగుందే అని ద‌గ్గ‌రికి వ‌చ్చి,  కొప్పుపై ఉన్న‌ది పిన్ కాద‌ని నిజ‌మైన పాము అని గ్ర‌హించి ప‌రుగులు తీశారు.  ఇదుక్క‌డి విడ్డూరంగా బాబోయ్ ఆద‌మ‌రిస్తే… పాము కాటుకు చచ్చేవాళ్ల‌మ‌ని భ‌య‌ప‌డి ప‌రుగులు తీశార‌ట‌.  

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Read: ఆ ఇంటి నిండా పాత వ‌స్తువులే… ఎందుకు దాస్తున్నాడంటే…

Exit mobile version