NTV Telugu Site icon

రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఇదే అస‌లైన హీరో…

మొద‌టి ప్ర‌పంచ యుద్ధం కంటే రెండో ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో ఎక్కువ మంది మృతి చెందారు. అప్పుడ‌ప్పుడే ప్ర‌పంచం అడ్వాన్డ్స్ వెప‌న్స్‌ను త‌యారు చేసుకుంటున్న‌ది.  ఆ యుద్ధంలో త‌యారు చేసిన వెప‌న్స్‌ను వినియోగించారు.  పెద్ద సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  ఇక‌, రెండో ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో పోలెండ్ సైన్యానికి వ‌జ్‌టెక్ అనే ఎలుగుబంటి స‌హాయం చేసింది. యుద్ధ సామాగ్రితో కూడిన పెద్ద పెద్ద పెట్టెల‌ను మోసుకుంటూ కొండ‌ల‌ను దాటింది.  సైనికుల‌కు కావాల్సిన స‌హాయాన్ని చేసింది ఈ వ‌జ్‌టెక్ అనె ఎలుగుబంటి.  ఈ వ‌జ్‌టెక్ చేసే ప‌నులు చూసి బ్రిటిష్ సైనికులు షాక్ అయ్యార‌ట‌.  పోలెండ్ సైన్యం ఇరాన్ మీదుగా వ‌స్తున్న స‌మ‌యంలో త‌ల్లిని కోల్పోయిన పిల్ల ఎలుగుబంటి పిల్ల‌ను శ‌ర‌ణార్ధులు పోలెండ్ సైన్యానికి అప్ప‌గించారు.  అప్ప‌టి నుంచి ఆ ఎలుగుబంటి పోలెండ్ సైనికుల‌తో క‌లిసిపోయింది.  వారితో పాటే జీవ‌నం సాగించింది.  యుద్ధంలో ఉన్న సైనికుల‌తో పాటుగా బ‌రువైన బాక్సుల‌ను మోస్తూ వారికి స‌హ‌కారం అందించింది.   ఎన్నో సేవ‌లు చేసిన వ‌జ్‌టెక్ ఎలుగుబంటికి పోలెండ్ తో పాటుగా బ్రిట‌న్‌లో అనేక ప్రాంతాల్లో స్మార‌క చిహ్నాల‌ను ఏర్పాటు చేశారు.  

Read: మ‌న‌దేశంలో టీవీ ప్ర‌సారాలు ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మ‌య్యాయో తెలుసా?