Site icon NTV Telugu

సీరం కోవావ్యాక్స్ అత్యవసర వినియోగానికి WHO ఓకె

కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటున్న వేళ పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని అంతా కోరుకుంటున్నారు. WHO కోవా వ్యాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీంతో చిన్నారుల్ని ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు అవకాశం ఏర్పడింది. పిల్లలకు సంబంధించిన కొవిడ్‌ టీకాను రాబోయే ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం కోవోవాక్స్‌ ట్రయల్‌ జరుగుతున్నాయి. టీకా మూడు సంవత్సరాల లోపు పిల్లలకు కరోనా నుంచి కాపాడుతుందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు.

WHO Approves Emergency use for Serum Institute's Covovax Vaccine | Ntv

ప్రస్తుతం సీరం సంస్థ ‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ 18 సంవత్సరాలు పైబడిన వారి కోసం తయారు చేసింది. కోవిడ్ వల్ల పిల్లల్లో తీవ్రమైన ఇబ్బందులు అంతగా కనిపించకపోయినా త్వరగా టీకా తేవడానికి సీరం పనిచేస్తోందన్నారు. ఆరు నెలల్లోగా తప్పనిసరిగా పిల్లల టీకా మార్కెట్లోకి తీసుకువస్తామని, మూడేళ్లలోపు పిల్లలకు అందుబాటులో ఉంటుందని సీరం ఇనిస్టిట్యూట్ అంటోంది.

Exit mobile version