NTV Telugu Site icon

వాట్సాప్‌ లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌… ఎలా ఉండ‌బోతుందంటే…

ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది వినియోగిస్తున్న మెసేజ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌.  వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన త‌రువాత అనేక ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  రీసెంట్‌గా వాట్సాప్ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌ను ఫీచ‌ర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.  కాగా, త్వ‌ర‌లోనే మరో ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తున్న‌ట్టు ఎక్స్‌డీఏ టెక్నాల‌జీ తెలియ‌జేసింది.  ఇప్ప‌టి వ‌ర‌కు వాట్సాప్‌లో గ్రూప్స్ ఉన్నాయిగాని, గ్రూప్ చాటింగ్ పౌక‌ర్యం లేదు.  ఈ గ్రూప్ చాటింగ్ సౌక‌ర్యాన్ని త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకురాబోతున్న‌ది. వాట్సాప్‌.  ప్ర‌స్తుతం ఈ వెర్స‌న్ టెస్టింగ్ ద‌శ‌లో ఉన్న‌ట్టు ఎక్స‌డీఏ తెలియ‌జేసింది.  టెస్టింగ్ ఫార్మాట్ పూర్త‌య్యాక అందుబాటులోకి తీసుకొస్తామ‌ని, త‌ప్ప‌కుండా ఈ న్యూ గ్రూప్ ఛాటింగ్ సౌక‌ర్యం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంద‌ని ఎక్స‌డీఏ ప్ర‌తినిధులు చెబుతున్నారు.  ఈ కమ్యునిటీ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తే గ్రూప్ లో చేస్తున్న మెసేజింగ్ విధానం పూర్తిగా మారిపోతుంద‌ని, గ్రూప్ చాటింగ్ విధానం వ‌ల‌న అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని ఎక్స్‌డీఏ ప్ర‌తినిధులు చెబుతున్నారు. 

Read: ఆ ఒక్క మాట‌తో రూ.25 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం…