ప్రేమకు వయసుతో పనిలేదు. పెళ్లితో పనిలేదు. ఎప్పుడైనా ఎవరైనా సరే ప్రేమలో పడొచ్చు. సాంకేతక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత వాట్సాప్ ప్రేమలు ఎక్కువయ్యాయి. ఇలానే రెండేళ్ల క్రితం ఓ యాభై ఏళ్ల వ్యక్తి ఓ యువతి ప్రేమలో పడ్డాడు. రెండేళ్లుగా వారు వాట్సాప్‌లోనే మాట్లాడుకున్నారు. ఛాటింగ్ చేసుకున్నారు. ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. రెండేళ్ల తరువాత ఓ హోటల్‌లో కలుసుకోవాలని అనుకున్నారు.
Read: మేకప్ లేకుండా భార్యను చూసి షాకైన భర్త… వెంటనే…
ముందుగా ఫిక్స్ చేసుకున్న హోటల్‌కు ఫిక్స్ చేసుకున్న సమయానికి హోటల్‌కు వెళ్లాడు ఆ పెద్దాయన. అయితే, అక్కడ యువతి స్థానంలో ముగ్గురు వ్యక్తులు కనిపించారు. ఆ పెద్దాయన్ను పక్కకు తీసుకెళ్లి బెదిరించారు. ఆయన దగ్గర ఉన్న కార్డులు లాక్కున్నారు. ఆ పెద్దాయన అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో డ్రా చేసుకున్నారు. విషయం గ్రహించేలోపే అకౌంట్ మొత్తం గుల్లయింది. వెంటనే ఆ పెద్దాయన జరిగిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.