NTV Telugu Site icon

ఆ ఏడు గంట‌లు మూగ‌బోయిన ప్ర‌పంచం…

కాసేపు సోష‌ల్ మీడియా ప‌నిచేయ‌క‌పోతే ఎంత మంది ఎన్ని ఇబ్బందులు ప‌డ‌తారో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  అలాంటిది ఏకంగా ఏడు గంట‌ల‌పాటు సోష‌ల్ మీడియా ప‌నిచేయ‌కుంటే ఎన్ని ఇబ్బందులు వ‌స్తాయో చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.  సోమ‌వారం రాత్రి 9:30 గంట‌ల నుంచి మంగ‌ళ‌వారం ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు సుమారు 7 గంట‌ల పాటు సోష‌ల్ మీడియా ఆగిపోయింది.  ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్స‌ప్‌లు నిలిచిపోయాయి.  ప‌నిచేయ‌లేదు.  దీంతో ఏమైందో తెలియ‌క కోట్లాది మంది భ‌య‌ప‌డ్డారు. అయితే, ఈరోజు ఉద‌యం 4 గంట‌ల స‌మ‌యంలో తిరిగి పున‌రుద్ద‌రించ‌బ‌డ్డాయి.  సాంకేతిక లోపం కార‌ణంగా స్థంబించిన‌ట్టు వాట్స‌ప్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.  అప్డేట్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది.  ఫేస్‌బుక్, వాట్స‌ప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు పనిచేయ‌క‌పోవ‌డంతో మైక్రోబ్లాగింగ్ ట్విట్ట‌ర్ పై ఒత్తిడి పెరిగింది. 

Read: అక్టోబర్ 5, మంగళవారం దినఫలాలు