Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. నేడు ఇండియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. సింగపూర్‌ షట్లర్‌ లోహ్‌ కీన్‌ యాతో భారత షట్లర్ లక్ష్యసేన్‌ తలపడనున్నాడు.
  2. నేడు తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై దర్శించుకోనున్నారు. ఇప్పటికే తిరుమలకు చేరుకున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి టీటీడీ అదనపు ఈవో ధర్మరెడ్డి స్వాగతం పలికారు.
  3. నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. కరోనా దృష్ట్యా అంతర్గతంగా అగ్నిగుండాలు, పెద్దపట్నం నిర్వహించనున్నారు.
  4. హైదరాబాద్‌లో నేడు, రేపు పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రైల్వేట్రాక్ మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
  5. ఉత్తరఖండ్‌లో నేడు బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి అమిత్‌ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు హజరుకానున్నారు. ఈ సందర్భంగా ఉత్తరఖండ్‌ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేయనుంది.
  6. నేటితో తెలంగాణలో స్కూళ్ల సెలువులు ముగియనున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణలో రేపటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. నేడు సెలవులపై అధికారింగా ప్రకటించే అవకాశం ఉంది.
  7. సంక్రాంతి రద్దీ దృష్ట్యా నేటి నుంచి 3రోజుల పాటు వికారాబాద్‌కు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. నరసాపురం నుంచి వికారాబాద్‌కు ఈ ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి.
Exit mobile version