నేడు యూపీలో తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేయనుంది. ఇటీవలే ఎన్నికల సంఘం 5 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో 7 దశల్లో 5 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగనుంది.
నేటి నుంచి అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ జరుగనుంది. వెస్టిండీస్‌లో సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ప్రపంచకప్ కోసం 16 జట్లు పోటీ పడుతున్నాయి. ఫిబ్రవరి 5న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
నేడు యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియ-ఇంగ్లాడ్ ఐదో టెస్ట్ జరుగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వరకు అల్పపీడన ద్రోణి కోనసాగుతోంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతం నుంచి తూర్పువైపు గాలులు వీస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనితో పాటు రాయసీమలో వడగళ్ల వాన, కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,000లుగా ఉంది.