Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. నేడు యూపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మీరట్‌లో మేజర్‌ ధ్యాన్‌చండ్‌ స్పోర్ట్స్‌ వర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు.
  2. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు కేరళలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొచ్చిలో ఇంటిగ్రేషన్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
  3. తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంఘీభావంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ నేడు కరీంనగర్‌లో జాగరణ దీక్ష చేపట్టనున్నారు. ఈ రోజు రాత్రి నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఈ జాగరణ దీక్ష కొనసాగనుంది.
  4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,590లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,450లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,600లుగా ఉంది.
Exit mobile version