* నేడు రెవెన్యూ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం..
* నేడు వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం.. ఉదయం 11 గంటలకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై మీడియాతో మాట్లాడనున్న జగన్..
* నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన.. హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్ధిపేట, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
* నేడు, రేపు జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు హాఫ్ డే సెలవు.. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒంటిపూట బడులు..
* నేడు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొననున్న ఎంపీ లక్ష్మీణ్..
* నేడు పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రీపోలింగ్.. అచ్చువెల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రీపోలింగ్.. నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి
* నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం నిందితుల రిమాండ్.. నేడు 12 మంది నిందితులను న్యాయస్థానంలో హాజరు పర్చనున్న సిట్.. రిమాండ్ పొడిగింపుపై ఇవాళ ఆదేశాలు ఇవ్వనున్న కోర్టు.. ఫిజికల్ లేదా వర్చువల్ గా హాజరు పరిచే అవకాశం..
* నేడు ఏపీలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన.. తుళ్లూరు సమీపంలో బసవతారకం ఆస్పత్రి నిర్మాణం.. నిర్మాణ పనులు ప్రారంభించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15గంటల సమయం.. 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు..
* నేడు బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరుకానున్న మంచు లక్ష్మీ.. ఉదయం 11 గంటలకు విచారణకు వెళ్లనున్న మంచు లక్ష్మీ.. ఇప్పటికే విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా.. సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను వరుసగా విచారిస్తున్న ఈడీ.. మనీలాండరింగ్ అంశాలపైనే కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు..
* నేడు నిర్మాతల మండలితో ఫిల్మ్ ఫెడరేషన్ నేతల చర్చలు.. మధ్యాహ్నం 3గంటలకు ఫిలిం ఛాంబర్ లో సమావేశం.. కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జగరనున్న భేటీ..
* నేటితో ముగియనున్న హెచ్ సీఏ సెక్రెటరీ దేవరాజ్ కస్టడీ.. బీసీసీఐ నిధుల గోల్ మాల్ పై సీఐడీ విచారణ..
* నేడు మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ నోటీసులు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో.. విచారణకు హాజరుకానున్న రైనా.. ఢిల్లీలోని ఆఫీసులో రైనాను విచారించనున్న ఈడీ..
