NTV Telugu Site icon

వరంగల్ ఎంజీఎంలో ప్రత్యేక వార్డ్‌ .. దేనికైనా రెడీ!

ఒకవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ తెలంగాణ వాసుల్ని భయపెడుతోంది. దీనికి తోడు కరోనా మూడో దశ ముంచుకువస్తుందన్న హెచ్చరిక నేపథ్యంలో వరంగల్ వైద్యవర్గాలు అప్రమత్తం అవుతున్నాయి. మూడో దశ తీవ్రత ఎలా ఉంటుందనే విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినా ముందస్తు చర్యల పైన అధికారులు దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణలో అయిదు ఉమ్మడి జిల్లాలకు ఏకైక పేదల పెద్ద ఆస్పత్రి అయిన వరంగల్‌ ఎంజీఎంలో మరో మారు 250 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.

ఒమిక్రాన్ ముంచుకొస్తున్న వేళ వరంగల్ జిల్లా వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాసుల కోవిడ్ చికిత్స కు నోడల్ సెంటర్ గా ఉన్న వరంగల్ ఎంజీఎం లో మరో సారి పెద్ద ఎత్తున ఏర్పట్లు సిద్ధం చేస్తున్నారు.. కరోనా మొదటి, వేవ్. సెకెండ్ వేవ్ లో తలెత్తిన దుష్పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. కోవిడ్ మొదటి వేవ్‌ సందర్భంగా ఎంజీఎంలో 250 పడకలను ఏర్పాటు చేయగా, రెండో వేవ్‌ నాటికి బెడ్స్ సంఖ్యను 800కి పెంచారు. ఇప్పుడు కూడా మొదట 250 పడకలను సిద్ధం చేసిన 800 పడకల వరకు పెంచేందుకు సన్నద్ధం చేశారు.

కరోనా మూడో దశకు అనుగుణంగా వరంగల్ ఎంజీఎం లో ప్రత్యేకంగా పిల్లలకు తగిన చికిత్స కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల కోసం 100పడకలతో ఒక వార్డును అప్పుడే సిద్ధం చేస్తున్నారు. పెద్దలకు వాడిన వెంటిలేటర్స్‌ పిల్లలకు సరిపోవు. కాబట్టి చిన్న పిల్లలకు సరిపోయే 100 వెంటిలేటర్లను సమకూర్చుకుంటున్నాం. వీటిలో 20 వెంటిలేటర్లు నవజాత శిశువులకు పనికొచ్చేట్టు రెడీ చేస్తున్నారు.

మందుల విషయానికి వస్తే ఎక్కడా లోటు రాకుండా ముందస్తుగానే ఏర్పటు చేసుకుంటున్నారు.. పిల్లలకు రెమ్‌డెవిసిర్‌ పనిచేయదు. కాబట్టి కరోనా బాధిత పిల్లలకు శక్తివంతంగా పనిచేసే ఐబీ ఇమ్యూనోగ్లాబిన్‌ (ఐబీఐజీ) అనే మందును కూడా ముందస్తుగానే తెచ్చి పెట్టునుకునే పనిలో ఎంజీఎం సూపరింటెండెంట్ చేస్తున్నారు. పెద్దలకు కరోనా చికిత్స అందించడం కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం అయిన ఎంజీఎం వైద్య సిబ్బంది. థర్డ్‌వేవ్‌లో కరోనా ప్రభావం పిల్లలపై చూపిన పక్షంలో వారికి సకాలంలో, సమర్ధవంతమైన రీతిలో చికిత్స అందచేసేందుకు ఎంజీఎంలో ఉన్న అయిదుగురు పీడియాట్రిక్‌ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తో పాటు పలువురు సీనియర్ డాక్టర్లు సిద్ధం అయ్యారు.. మడత6 250 పడకల ఆతర్వాత 800 పడకలకు నిత్యం ఆక్సిజన్స్ అందించేలాగా రెండు ఆక్సిజన్స్ ప్లాంట్స్ రెడీగా ఉన్నాయి.