NTV Telugu Site icon

కెప్టెన్ గా కోహ్లీ ముందు అరుదైన రికార్డు…

Virat-Kohli

Virat-Kohli

రేపు న్యూజిలాండ్ తో జరగనున్న రెండవ టెస్ట్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ ముందు ఓ అద్భుతమైన రికార్డు ఉంది. కోహ్లీ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 70 సెంచరీలు నమోదు చేసాడు. అందులో కెప్టెన్ గా 41 శతకాలు ఉన్నాయి. దాంతో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా అన్ని ఫార్మటు లలో కలిపి అత్యధికంగా శతకాలు చేసిన రికీ పాంటింగ్ సరసన కోహ్లీ నిలిచాడు.

కాబట్టి పాంటింగ్ నెలకొల్పిన ఈ రికార్డు ను సమ చేసిన కోహ్లీ బ్రేక్ చేయాలంటే రేపు న్యూజిలాండ్ తో జరగనున్న రెండో టెస్ట్ లో ఒక్క సెంచరీ చేస్తే.. కెప్టెన్ గా అత్యధికంగా 42 సెంచరీలు చేసిన ఏకైక కెప్టెన్ గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేస్తాడు. అయితే రేపు మ్యాచ్ జరగనున్న వాంఖడే స్టేడియంలో కోహ్లీకి అద్భుతమైన గణాంకాలు ఉన్నాయి. ఈ స్టేడియంలో ఆడిన నాలుగు టెస్టుల్లో కోహ్లీ 433 పరుగులు చేశాడు. చివరగా ఆడిన మ్యాచ్ లో కోహ్లీ 235 పరుగులు చేశాడు. కాబట్టి రేపటి మ్యాచ్ లో కూడా కోహ్లీ విజృంభిస్తాడు అని అభిమానులు భావిస్తున్నారు. కానీ కోహ్లీ సెంచరీ చేయక రెండు ఏళ్ళు దాటినా విషయం తెలిసిందే. మరి రేపు కోహ్లీ ఏం చేస్తాడో చూడాలి.