వన్యప్రాణులను దగ్గర నుంచి చూడవచ్చు… ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అదే వన్యమృగాలను దూరం నుంచే చూడాలి. దగ్గరగా చూడాలి, వీడియోలు తీసుకోవాలి అంటే ఇదుగో ఇలానే జరుగుతుంది. సింహాలకు ఆఫ్రికా ఖండం ప్రసిద్ధి. ఆఫ్రికాలలోని టాంజానియాలో సింహాల సంఖ్య అధికం. అవి చాలా కౄరంగా ఉంటాయి. టాంజానియాలోని నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సఫారీకి పెట్టింది పేరు. ఆ దేశానికి ఆదాయం వైల్డ్‌లైఫ్ సఫారి నుంచి అధికంగా వస్తుంది. నిత్యం వేలాది మంది టాంజానియాను సందర్శిస్తుంటారు. సఫారీలో గైడ్ సంరక్షణలో టూరిస్టులు నేషనల్ పార్క్‌లో ట్రక్కుల్లో వెళ్లి కౄరమృగాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. గైడ్ ఉంటాడు కాబట్టి రక్షణ ఉంటుంది. గైడ్ చెప్పిన రూల్స్‌ను తప్పనిసరిగా వైల్డ్‌లైఫ్ సఫారీలో ఫాలో కావాలి. లేదంటే ప్రాణాలమీదకు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
Read: పంజాబ్‌లో వేడెక్కుతున్న రాజకీయం: కెప్టెన్ వర్సెస్ సిద్ధూ…
వైల్డ్‌లైఫ్ సఫారీలోకి అడుగుపెట్టిన బస్సు సింహం పక్కన నిలబడింది. అయితే, ఆ సింహం దాని మానానా అది పడుకొని ఉండగా, ఓ టూరిస్ట్ కిటికీ అద్దం తెరిచి వీడియో తీయడం మొదలుపెట్టాడు. కొంతసేపటి తరువాత ఆ సింహం అతడిని చూసింది. అయినప్పటికీ ఆ యువకుడు అలర్ట్ కాలేదు. వెంటనే ఆ సింహాం అతనిమీదకు దూకింది. క్షణకాలంలో వెనక్కి వచ్చేసి కిటికీ అద్దాన్ని మూసేశాడు. లేదంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.