Site icon NTV Telugu

వైరల్ వీడియో.. డ్యాన్స్‌లో అదరగొట్టిన ఏపీ మంత్రి

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తనలో మరో టాలెంట్‌ను బయటపెట్టారు. తన కుమార్తె వివాహ వేడుకలో డ్యాన్సులు వేసి అదరగొట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ సతీమణి భారతి సహా పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అతిథులను ఉత్సాహపరిచేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ తన కుమార్తెతో కలిసి డ్యాన్స్ వేశారు.

Read Also: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలి : జీవీఎల్‌

నితిన్ హీరోగా నటించిన ‘సై’ సినిమాలోని ‘నల్లా నల్లాని పిల్ల’ అంటూ సాగే పాటకు మంత్రి ఆదిమూలపు సురేష్ తన కుమార్తె శ్రిష్టితో కలిసి డ్యాన్స్ వేయడంతో స్టేజ్ కింద ఉన్నవారంతా ఈలలు వేస్తూ గోల చేశారు. ప్రస్తుతం మంత్రి సురేష్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారందరూ డ్యాన్సింగ్ టాలెంట్‌‌తో మంత్రి సురేష్ అదరగొట్టారని కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version