Site icon NTV Telugu

Violence in Bengal : బెంగాల్‌లో మరోసారి హింస.. కలిగంజ్‌లో చెలరేగిన ఘర్షణలు

Bangal

Bangal

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి హింస చలరేగింది. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని కలియాగంజ్‌లో ఓ మైనర్ బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఉదయం కాలువ నీటిలో తేలియాడుతున్న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో అక్కడ ఘర్షణలు చెలరేగాయి. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరగ్గా, బాధితురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
Also Read:Heavy Rain: తమిళనాడులోని 15 జిల్లాల్లో రేపు భారీ వర్షాలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గంగువా గ్రామానికి చెందిన బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైంది. బంధువులు, గ్రామస్తులు విస్తృతంగా వెతికినా ఆమె జాడను గుర్తించలేదు. శనివారం ఉదయం బాలిక మృతదేహం కనిపించింది. ఈ సందర్భంగా ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. స్థానికులు రోడ్డు దిగ్బంధనం చేసి, టైర్లు తగులబెట్టి, పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Also Read:ITBP Jawan: విషాదం.. కూలర్‌లో నీళ్లు నింపుతుండగా విద్యుత్ షాక్, జవాన్ మృతి

బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు నార్త్ దినాజ్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ సనా అక్తర్ తెలిపారు. మైనర్ బాలిక మృతదేహం దగ్గర విషం నింపిన సీసా కనిపించిందని అక్తర్ చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరణానికి గల కారణాలను విశ్లేషించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేశారు. బాధితురాలి శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సిడబ్ల్యు) ఈ ఘటనపై దృష్టి సారించింది. ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయమైన దర్యాప్తు జరిగేలా చూడాలని పశ్చిమ బెంగాల్ పోలీసులను ఆదేశించింది.

Exit mobile version