బంగ్లాదేశ్‌లో మతపరమైన హింస కొనసాగుతూనే ఉన్నది. చిట్టగాంగ్ డివిజన్‌లోని కుమిల్లాలో దుర్గాపూజ సందర్భంగా వేదిక వద్ద కొంతమంది వ్యక్తులు చేసిన మత దూషణ కారణంగా హిందూ దేవాలయాలపై దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల అంశం సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో దేశ వ్యాప్తంగా హిందూ దేవాలయాలపైనా, హిందువుల ఇళ్లపైనా దాడులు జరుగుతున్నాయి. తాజాగా రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాజిపారాలో గ్రామంలో హిందూవులకు చెందిన 29 ఇళ్లను తగలబెట్టారు. గ్రామంలోని 20 గడ్డివాములకు సైతం దుండగులు నిప్పు పెట్టడంతో గ్రామం మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ మంటల్లో చిక్కుకొని ఇద్దరు మరణించినట్టు సమాచారం. దేశంలో మతపరమైన హింసలు పెరిగిపోవడంతో బంగ్లా ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మతపరమైన హింసలను సహించేది లేదని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
బంగ్లాలో చల్లారని హింస: 29 ఇళ్లకు నిప్పు…
