NTV Telugu Site icon

బ‌ద్వేల్ ఉపఎన్నిక‌లు: బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు ఆ గ్రామ‌స్తులు ప్ర‌క‌ట‌న‌…

బద్వేల్ ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈనెల 30 వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఎన్నిక‌ల్లో పోటీ చేసే పార్టీలు ప్ర‌చారం చేసేందుకు సిద్ద‌మ‌వుతున్న త‌రుణంలో అట్లూరు మండ‌లంలోని చిన్నమ‌రాజుప‌ల్లె గ్రామ‌స్థులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  ఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినా త‌మ గ్రామానికి రోడ్డు సౌక‌ర్యం క‌ల్పించ‌లేద‌ని, తాము బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని గ్రామ‌స్తులు పేర్కొన్నారు.  ఉప ఎన్నిక‌లను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని గ్రామ పొలిమేర్ల‌లో బ్యాన‌ర్‌ను క‌ట్టారు.  ఏ నాయ‌కుడు త‌మ గ్రామంలోకి రావొద్ద‌ని, గ్రామానికి రోడ్డు వేసిన త‌రువాతే నాయ‌కులు గ్రామంలోకి అడుగుపెట్టాల‌ని గ్రామ‌స్తులు పేర్కొన్నారు.  ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయకులు గ్రామంలోకి వ‌చ్చి ఓట్లు వేయించుకుంటున్నార‌ని, గెలిచిన త‌రువాత త‌మ గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అందుకే ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  

Read: లైవ్‌: కోడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంలో వైఎస్ ష‌ర్మిల స‌భ‌…