Site icon NTV Telugu

పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో మహానాడులో ఏడవండి..

ఇవాళ టిడిపి మహానాడు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహానాడు కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతారు..? అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతావ్ బాబూ? కుప్పంలో ఎందుకు ఖంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో ఆ జూమ్ నాడులో ఏడవండి. ఇంకెంతకాలం ఈ ఆత్మవంచన? జూమ్ మీటింగ్ అనగానే వాలిపోయే పచ్చ నేతలు ఒక్కరూ నియోజకవర్గాల్లో కనిపించరు. ప్రజలను గాలికొదిలేశారు సరే పరామర్శల కోసం విశాఖ వచ్చిన లోకేశంనూ పట్టించుకోలేదు. అద్దె మైకులతో రెచ్చిపోయే అచ్చన్న, అయ్యన్న, కూన, గంటా ఏమైపోయారు? లోకేశం అంటే అచ్చన్నకున్న అభిప్రాయమే అందరిదా?” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version