Site icon NTV Telugu

వైభవంగా ఉపరాష్ట్రపతి మనవరాలి వివాహం.. హాజరైన కేసీఆర్, చంద్రబాబు, పవన్

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం కన్నులపండుగగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరినాలో వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె నిహారిక వివాహం వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన రవితేజను వెంకయ్య మనవరాలు నిహారిక వివాహం చేసుకున్నారు.

అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. అలాగే, తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, అక్కినేని నాగార్జున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Exit mobile version