Site icon NTV Telugu

మార్నింగ్ వాక్ .. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉప రాష్ట్రపతి

ఆరోగ్యమే మహాభాగ్యం. ఉదయపు నడక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అందుకే డాక్టర్లు ఉదయం వాకింగ్ చేయాలంటున్నారు. స్వంత రాష్ట్ర పర్యటనలో వున్న భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మార్నింగ్ వాక్ చేశారు.

స్వర్ణభారతి ట్రస్ట్ లో విద్యార్ధులతో వెంకయ్య మాటా మంతీ

విజయవాడ పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు ఉదయపు నడకతో ఉత్సాహంగా కనిపించారు. ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి వ్యాయామం చేశారు. వారికి నడక ప్రాధాన్యతను వివరించారు. ఎంత బిజీగా వున్న ఉదయం నడక సాగించాలని వెంకయ్య వారికి సూచించారు. ఆయనే స్వయంగా వివిధ వ్యాయామాలు చేశారు. విద్యార్ధులతో ముచ్చటించారు.

Exit mobile version