Site icon NTV Telugu

వెహికల్ స్క్రాపేజ్‌ పాలసీ వలన ఎవరికి లాభం…

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే వెహికిల్ స్క్రాపేజ్ పాల‌సీని తీసుకొచ్చింది.  ఈ పాల‌సీ ప్ర‌కారం గ‌డువు తీరిన వాహ‌నాల‌ను తుక్కుగా మార్చేస్తారు.  ఇలా స్క్రాప్‌ను తిరిగి వినియోగించే విధంగా మార్చేస్తుంటారు.  గ‌డువు తీరిన వాహ‌నాలు బ‌య‌ట రోడ్ల‌పై తిరుగుతుండ‌టం వ‌ల‌న కాలుష్యం పెరుగుతుంది.  ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి.  అందుకే కేంద్రం ఈ పాల‌సీని అమ‌ల్లోకి తెచ్చింది.  వ్య‌క్తిగ‌త వాహ‌నాలకు 15 ఏళ్ల ప‌రిమితి ఉంటే, వాణిజ్య‌వాహ‌నాల‌కు  ప‌దేళ్ల ప‌రిమితి ఉంటుంది.  అయితే, ప‌దేళ్ల త‌రువాత మ‌రోసారి వీటికి ఫిట్నెస్ టెస్ట్ నిర్వ‌హిస్తారు.  ఒక‌వేళ ఈ టెస్టులో పాస్ అయితే మ‌రో  ఐదేళ్ల‌పాటు వాహ‌నాలు న‌డిపేందుకు అవ‌కాశం ఉంటుంది.  వ‌ద్దు అనుకుంటే వాటిని ప్ర‌భుత్వం స్క్రాప్‌కు పంపుతుంది.  అంతేకాదు, స్క్రాప్‌కు ఇవ్వాల‌ని అనుకున్న వాహ‌నాల‌కు ఎక్స్ షోరూమ్ ధ‌ర‌ప్ర‌కారం 4 నుంచి 6 శాతం వ‌ర‌కు ప్రొత్సాహ‌కాలు ఉంటాయి.  రోడ్డు ప‌న్ను నుంచి 25శాతం, వాణిజ్య‌వాహ‌నాల కోనుగోలు నుంచి 15 శాతం రాయితీ ల‌భిస్తుంది.  

Read: ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హుస్సేన్ సాగర్…

Exit mobile version