Site icon NTV Telugu

మ‌ధిర కౌన్సిల‌ర్ మ‌ల్లాది వాసు వ్యాఖ్య‌ల‌పై వ‌ల్ల‌భ‌నేని వంశీ కౌంట‌ర్‌…

మ‌ధిర టీఆర్ఎస్ కౌన్సిల‌ర్ మ‌ల్లాది వాసు ఇటీవ‌లే కొన్ని వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, అంబ‌టి రాంబాబును భౌతికంగా నిర్మూలించాల‌ని వ్యాఖ్య‌లు చేశారు.  ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి.  కౌన్సిల‌ర్ మ‌ల్లాది వాసు వ్యాఖ్య‌ల‌పై వ‌ల్ల‌భ‌నేని వంశీ స్పందించారు.  స‌మాజానికి ఎంతో సేవ చేస్తున్న సామాజిక వ‌ర్గాన్ని కుట్ర‌లు, కుతంత్రాల వైపు చంద్ర‌బాబు న‌డిపిస్తున్నారు.  

Read: 2021 బెస్ట్ యాప్‌లు ఇవే…

మ‌ల్లాది వాసు లాంటి వారిని వివిధ పార్టీల్లో పెట్టి చంద్ర‌బాబు పోషిస్తున్నారు.  ఇవ‌న్నీ చంద్ర‌బాబు త‌న ఉనికిని కాపాడుకోవ‌డానికే చేస్తున్నార‌ని వంశీ మండిప‌డ్డారు.  క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని నాశ‌నం చేస్తున్న‌ది చంద్ర‌బాబే అని, చంద్ర‌బాబు క‌మ్మసామాజిక వ‌ర్గానికి ప‌ట్టిన చీడ‌పురుగు అని అరికెపూడి గాంధీ అన్నారు.  అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై కూడా వంశీ ఫైర్ అయ్యారు.  అరికెపూడి గాంధీ క‌మ్మ‌సంఘం నేత‌నా? ఎమ్మెల్యేనా అని ప్ర‌శ్నించారు.  

Exit mobile version