రేపటి నుంచి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు నిర్వహించనన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి రోజుకో రూపంలో శ్రీరామచంద్ర స్వామి దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా పగల్ పత్తు, రాపత్తు, విలాస ఉత్సవాలు నిర్వహించన్నారు. రేపు మత్య్సావతారం, 4వ తేదీన కూర్మావతారం, 5న వరాహావతారం, 6న నరసింహావతారం, 7న వామనావతారం, 8న పరశురామావతారం, 9న శ్రీరామావతారం, 10న బలరామవతారం, 11న శ్రీకృష్ణావతారంలో స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అలాగే 12వ తేదీన గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 13వ తేదీన ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 13 వరకు నిత్య కల్యాణాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.