Site icon NTV Telugu

దేశంలో మ‌రో చ‌ట్టం రద్దు…

ఉత్త‌రాఖండ్ పేరు విన‌గానే మన‌కు చార్‌ధామ్ యాత్ర గుర్తుకు వ‌స్తుంది.  ఉత్త‌రాఖండ్‌ను దేవ‌భూమిగా పిలుస్తారు.  కేదారినాథ్‌, బ‌ద్రీనాథ్‌, య‌మునోత్రి, గంగోత్రి ఇలా ఎన్నో ప్రసిద్ధ దేవాల‌యాలు ఉన్నాయి.  అయితే, 2019లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి త్రివేంద్ర సింగ్ రావ‌త్ చార్‌ధామ్ బోర్డును ఏర్పాటు చేసింది.  ఈ బోర్డు కింద మొత్తం 51 దేవాల‌యాల‌ను తీసుకొచ్చింది.  అయితే, ఈ బోర్డు ఏర్పాటు కార‌ణంగా త‌మ సంప్ర‌దాయ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతంద‌ని పూజారులు ఆందోళ‌న చేస్తున్నారు.  ఈ బోర్డు చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.  

Read: డాక్ట‌ర్ వికృత చేష్ట‌లు… చేస్తున్న ఆప‌రేష‌న్‌ను మ‌ధ్య‌లో వ‌దిలేసి…

దీనిపై ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం మ‌నోహ‌ర్ కాంత్ ధ్యానీ నేతృత్వంలో ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది.  ఈ క‌మిటీ ఇటీవ‌లే నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేసింది.  ఈ నివేదిక ఆధారంగా ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం చార్‌ధామ్ బోర్డును ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  బోర్డును ర‌ద్దుచేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో పూజారులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.  రాష్ట్ర‌ప్ర‌భుత్వంపై నిరంత‌రం ఒత్తిడి కార‌ణంగానే ఇది సాధ్య‌మైంద‌ని పూజారులు పేర్కొన్నారు.

Exit mobile version