Site icon NTV Telugu

ఒక్క సెకనులో కరోనా నిర్ధారణ పరీక్షా… త్వరలో అందుబాటులోకి.. 

కరోనా మహమ్మారి మొదటి దశలో ఉండగా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావడానికి రోజుల తరబడి సమయం పట్టేది.  ఆ తరువాత వేగవంతంగా నిర్ధారణ చేసే కిట్ లు అందుబాటులోకి వచ్చాయి.  దీంతో సమయం అగ్గిపోయింది.  గంటల వ్యవధిలోనే ఫలితాలు వస్తున్నాయి.  అయితే, ఖచ్చితంగా నిర్ధారణ జరగాలి అంటే ఆర్టిపీసీఆర్ టెస్టులు చేయాలి.  దీనికి ఎక్కువ ఖర్చు, సమయం పడుతుంది.  దీంతో  మిచిగాన్ కు చెందిన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన నిర్ధారణ వచ్చే కిట్లను తయారు చేశారు.  లాలాజలంతో నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఈ కిట్లను రూపొందించారు.  ఒక్క సెకనులోనే దీనికి నిర్ధారణ చేయవచ్చు.  కేవలం కరోనాకు మాత్రమే కాకుండా ఇతర వ్యాధుల నిర్ధారణ కోసం కూడా ఈ కిట్లను వినియోగించుకునే విధంగా ఈ కిట్లను తయారు చేస్తున్నారు.  ఈ ప్రయోగం విజయవంతమైతే తక్కువ సమయంలో సొంతంగా కరోనా టెస్టులు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.  

Exit mobile version